సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు..!
By సుభాష్ Published on 29 Aug 2020 8:36 AM ISTడిగ్రీ, పీజీ పరీక్షలు ఖచ్చితంగా జరపాల్సిందేనని ఆదేశాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. కరోనా మహమ్మారి వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వాలు, యూనివర్సిటీలు సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలపై యూనివర్సిటీ రిజిస్టార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సెప్టెంబర్ 14వ తేదీ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే పరీక్షలకు ఏర్పాట్లు చేసేందుకు కూడా రెండు వారాల సమయం పడుతుందని, అప్పుడే నిర్వస్తే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే మరో రెండు రోజుల్లో పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను యూనివర్సిటీలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, పీజీ, డిగ్రీ బ్యాక్‌లాక్ పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహంచాలని, ఇందులో యూజీసీ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.