తెలంగాణలో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 25 Sept 2020 9:01 AM ISTతెలంగాణలో కరోనా మహమ్మారి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక రోజు కేసుల సంఖ్య తగ్గినా.. మరుసటి రోజు పెరుగుతోంది. ఏదీ ఏమైనా పూర్తిగా తగ్గిపోయేంతా రోజులు ఇంకా దూరంగానే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పాజిటివ్ కేసులపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 10 మంది మృతి చెందారు. ప్రతి రోజు కూడా మరణాల సంఖ్యకూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
గడిచిన 24 గంటల్లో ..
పాజిటివ్ కేసుల సంఖ్య – 2,381
మరణాల సంఖ్య – 10
కోలుకున్నవారు – 2,021
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య -1,81,627
మొత్తంమరణాల సంఖ్య – 1080
మొత్తం యాక్టివ్ కేసులు – 30,387
ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య – 24,592
రాష్ట్రంలో కోలుకున్నవారు – 1,50,160
రాష్ట్రంలో మరణాల రేటు – 0.59 శాతం
దేశంలో మరణాల రేటు – 1.58 శాతం
రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 82.67 శాతం
దేశంలో కోలుకున్నవారి రేటు – 81.71 శాతం
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసుల జిల్లాలు
జీహెచ్‌ఎంసీ – 386
కరీంనగర్ – 119
మేడ్చల్ మల్కాజిగిరి -193
నల్గొండ -132
రంగారెడ్డి – 227 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.