తెలంగాణ: 24 గంటల్లో 2,479 కరోనా కేసులు

By సుభాష్  Published on  9 Sep 2020 4:33 AM GMT
తెలంగాణ: 24 గంటల్లో 2,479 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఒక రోజు పాజిటవ్‌ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,47,642 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 916 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 62,649 పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 18,90,554కు చేరింది.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా పాజిటివ్‌ కేసులు:

జీహెచ్‌ఎంసీలో - 322

రంగారెడ్డి - 188

మేడ్చల్‌ మల్కాజిగిరి - 183

వరంగల్‌ అర్బన్‌ - 124

కరీంనగర్‌ - 120

నల్గొండ -108

నిజామాబాద్‌ - 101

సూర్యాపేట - 96

కామారెడ్డి - 94

ఖమ్మం - 94

సిద్దిపేట - 88

ఆదిలాబాద్‌ - 31

భద్రాది కొత్తగూడెం - 83

జగిత్యాల్‌ - 79

పెద్దపల్లి - 71

మంచిర్యాల - 67

మహబూబాబాద్‌ - 67

సిరిసిల్ల - 67

సంగారెడ్డి - 64

నాగర్‌ కర్నూలు 54

యాదాద్రి భువనగిరి - 46

నిర్మల్‌ - 43

మహబూబ్‌నగర్‌ - 40

జనగాం - 35

మెదక్‌ - 34

ములుగు - 34

వరంగల్‌ రూరల్‌ - 34

వనపర్తి -33

కొమురంభీం అసిఫాబాద్‌ - 24

గద్వాల్‌ - 23

వికరాబాద్‌ - 16

నారాయణపేట - 14

జయశంకర్‌ భూపాలపల్లి - 14

Next Story