తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌..ఈ రోజు ఎన్ని కేసులంటే

By సుభాష్  Published on  24 Aug 2020 4:26 AM GMT
తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌..ఈ రోజు ఎన్ని కేసులంటే

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1842 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 లక్ష 6వేల కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు 761 మంది మృతి చెందారు. ఇక కొత్తగా 1825 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 82,411కు చేరింది. ప్రస్తుతం 22,919 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని 16,482 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 పాజిటివ్‌ కేసులు, నిజామాబాద్‌ 158, కరీంనగరర్‌ 134, సూర్యాపేట 113, రంగారెడ్డి 109 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా, రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరి తప్పిదాల వల్ల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎలాంటి మార్గం లేదంటున్నారు. చాలా మంది ఎలాంటి మాస్క్‌లు ధరించకుండా బయటకు రావడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. జాగ్రత్తలు చేపట్టకపోతే తీసుకోకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.



Next Story