తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By సుభాష్  Published on  19 Oct 2020 3:36 AM GMT
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 948 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కొత్తగా నలుగురు మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటికు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,23,059 ఉండగా, మొత్తం మరణాల సంఖ్య 1,275 కు చేరింది. ఇక తాజాగా కరోనా నుంచి 1,896 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,00,68 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్‌ కేసులుండగా, గడిచిన 24గంటల్లో 26,027 మందికి పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పరీక్షల సంఖ్య 38,56,530కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాలు

జీహెచ్‌ఎంసీ - 212

రంగారెడ్డి - 98

మేడ్చల్‌ మల్కాజిగిరి - 65

కొత్త గూడెం -56

ఆదిలాబాద్‌ - 9

జగిత్యాల -11

భూపాలపల్లి - 7

సంగారెడ్డి - 42

సిద్దిపేట - 54

సూర్యాపేట - 28

గద్వాల - 9

కామారెడ్డి - 4

కరీంనగర్‌ - 63

ఖమ్మం - 25

కొమురం భీం-0

మహబూబ్‌నగర్‌ - 15

మంచిర్యాల - 9

మెదక్‌ - 6

ములుగు - 14

నాగర్‌ కర్నూలు - 11

నల్గొండ -35

నారాయణ్‌పేట -2

నిర్మల్‌ -5

నిజామాబాద్‌ - 29

పెద్దపల్లి - 14

రాజన్న సిరిసిల్ల 9

వికారాబాద్‌ - 5

వనపర్తి - 11

వరంగల్‌ రూరల్‌ - 11

వరంగల్‌ అర్బన్‌ -46

యాద్రాది భువనగిరి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Next Story