తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు

By సుభాష్
Published on : 29 Aug 2020 10:10 AM IST

తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువైపోతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. శుక్రవారం నాడు 2932 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 11 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 799కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 33,439 శాంపిళ్లను సేకరించగా, 771 శాంపిళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో 1,17,415 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 28,942 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

శుక్రవారం అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాలివే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో - 530

మేడ్చల్‌ -218

రంగారెడ్డి - 218

కరీంనగర్‌ 168

నల్గొండ - 159

నిజామాబాద్‌ - 129

ఖమ్మం - 141

మంచిర్యాల - 1118

జగిత్యాల - 113

సూర్యాపేట - 102

సిద్దిపేట - 100

ఇక ఇతర జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story