తెలంగాణలో కొత్తగా 1,554 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  16 Oct 2020 4:49 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,554 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 43,916 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 1,554 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదలైన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. కొత్తగా ఏడుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1256కు చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,19,224కు చేరింది.

ఇక తాజాగా కరోనా నుంచి 1435 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 19,4,653కు చేరంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,203 కేసులు యాక్టివ్‌లో ఉండగా, 19,251 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా ఏ మాత్రం తగ్గడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతంలో హైదరాబాద్‌లోనే అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. పల్లెటూర్లలో సైతం ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పూర్తిగా తగ్గిపోవడం కష్టంగా మారింది. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. ముఖానికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా నుంచి రక్షించుకోవచ్చు. కరోనాను కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది.

ప్రస్తుతం అన్‌లాక్‌ 5.0 ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా మహ్మారి వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఉపాధి లేక ఎందరో రోడ్డున పడ్డారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు ఒకటి, రెండు దశల్లో ఉండగా, మరికొన్ని వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story