తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

By సుభాష్  Published on  28 Sep 2020 3:35 AM GMT
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,378 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు 1,87,211 ఉండగా, మరణాలు 1107 ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 1,932 ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,56,431 ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతం ఉండగా, అదే దేశంలో అయితే 1.57 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 83.55 శాతం ఉండగా, దేశంలో 82.53 శాతం ఉంది. మొత్తం యాక్టివ్‌ కేసులు 29,673 ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 24,054 మంది ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నమోదైన పాజిటివ్‌ కేసుల జిల్లాలు.. జీహెచ్‌ఎంసీలో 254, రంగారెడ్డి 110 ఉండగా, మిగతా జిల్లాల్లో వంద లోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల మరణాల శాతం 46.13 శాతం ఉండగా, ఇతర వ్యాధుల వల్ల సంభవించిన మరణాల శాతం 53.87 ఉంది.

కాగా, ప్రతి రోజు 2వేలకుపైగా నమోదయ్యే పాజిటివ్‌ కేసులు.. ఈ రోజు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇదే విధంగా రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గిపోతే ఎంతో బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. ఇక జీహెచ్‌ఎంసీలో మాత్రం గతంలో తీవ్ర స్థాయిలో ఉన్న కేసులు..గత కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయాయి.

Coronavirus

Next Story