తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత వారం కిందట మూడువేలకు చేరువలో ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2278 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 10 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,54,880 ఉండగా, మృతుల సంఖ్య 950కి చేరింది. రాష్ట్రంలో 32,005 కేసులు యాక్టివ్‌లో ఉండగా, గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 2,458 మంది ఉంది. కొత్తగా అత్యధికంగా హైదరాబాద్‌లో 331 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి 184, మేడ్చల్‌ మల్కాజిగిరి 150, నల్గొండ 126, కరీంనగర్‌ 121, కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.

కాగా, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గితే.. మరొక రోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నారు. గతంలో హైదరాబాద్‌లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టి, ఇతర జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *