తెలంగాణ కరోనా వైరస్‌ విభృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,802 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,771 కేసులు నమోదు కాగా, 895 మంది మృతి చెందారు. కరోనాతో 2,711 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 31,635 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటి వరకు 1,10,241 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక జిల్లాల వారీగా అత్యధికంగా పాజిటివ్‌ కేసులను చూస్తే.. హైదరాబాద్‌లో 245, రంగారెడ్డి 158, కరీంనగర్‌ 136, సిద్దిపేట 106, సంగారెడ్డి 103 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ts Corona1

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *