తెలంగాణలో కొత్తగా 1,802 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 7 Sept 2020 9:23 AM ISTతెలంగాణ కరోనా వైరస్ విభృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,802 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,771 కేసులు నమోదు కాగా, 895 మంది మృతి చెందారు. కరోనాతో 2,711 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 31,635 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటి వరకు 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక జిల్లాల వారీగా అత్యధికంగా పాజిటివ్ కేసులను చూస్తే.. హైదరాబాద్‌లో 245, రంగారెడ్డి 158, కరీంనగర్ 136, సిద్దిపేట 106, సంగారెడ్డి 103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Next Story