తెలంగాణలో కొత్తగా 1,435 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  18 Oct 2020 5:00 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,435 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,435 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,22,111 చేరగా, మృతుల సంఖ్య 1,271కు చేరింది. ఇక తాజాగా కరోనా నుంచి 2,154 మంది డిశ్చార్జ్‌ కాగా, 1,98,790 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,154 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,98,790 కు చేరింది.

ఇక అత్యధికంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో.. జీహెచ్‌ఎంసీ 249, రంగారెడ్డి 110, మేడ్చల్‌ మల్కాజిగిరి 105 ఉన్నాయి. ఇక మిగతా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి.

Next Story