నేటి నుంచి బతుకమ్మ సంబరాలు షురూ..

By సుభాష్  Published on  16 Oct 2020 3:10 AM GMT
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు షురూ..

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు ఈనెల 24 వరకు ఈ పండగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మహిళలు, యువతులు, బాలికలకు ఎంతో ఇష్టమైన ఈ పండగను తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో తెలంగాణ పూల పండగను ముగించుకుంటారు. అయితే ఈ సారి కరోనా ప్రభావంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. ఇళ్ల వద్దనే పండగను జరుపుకోవాలని భావిస్తోంది.

బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులంతా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. పండగ జరుపుకొనే సమయంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పండగ జరుపుకోవాలని ఆమె కోరారు. పండగ సందర్భంగా తెలంగాణ జాగృతి మూడు వీడియో పాటలను , 9 పాటలతో కూడిన సీడీని విడుదల చేశారు.కాగా, సిద్దాంతాలు, వేద పండితులు మాత్రం అక్టోబర్‌ 16న అధిక ఆశ్వీజ మాసంలెఓ అమావాస్య నుంచి వరుసగా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మతో పండగ సంబరాలు ప్రారంభం కానున్నాయి.

Next Story