తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే
By సుభాష్ Published on 15 Oct 2020 9:09 AM ISTతెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,17,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1249 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1,949 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,93,218 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కోలుకున్న వారి రేటు 88.76 శాతం ఉండగా, దేశంలో 87.3 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 23,203 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 19,084 మంది ఉన్నారు.
అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీలో 244, మేడ్చల్ మల్కాజిగిరి 115 ఉండగా, మిగతా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి.