మా లైన్ ముందే చెప్పాం: భారత విదేశాంగ శాఖ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 8:56 AM GMT
మా లైన్ ముందే చెప్పాం: భారత విదేశాంగ శాఖ

ఢిల్లీ: కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని పదేపదే చెబుతున్న ట్రంప్‌ మాటలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాజాగా పాక్‌ పీఎం ఇమ్రాన్‌ ఖాన్‌ తో భేటీ సందర్భంగా మళ్లీ ట్రంప్‌ పాతపాటే పాడటంతో భారత విదేశాంగ అధికారులు స్పందించారు. అయితే..దీనిపై మరింత లోతుగా స్పందించడానికి ఒక రోజు ఆగాలని కోరారు. బుధవారం ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. 'హోడీ మోదీ' కార్యక్రమంలో ఇస్లామిక్‌ టెర్రరిజం గురించి ప్రస్తావించిన ట్రంప్..కశ్మీర్ విషయం లేవనెత్తడంపై విదేశాంగ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అయితే..గతంలోనే కశ్మీర్ విషయంలో మూడో దేశం, వ్యక్తి జోక్యం అవసరం లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ట్రంప్‌తో భేటీలో మరోమారు మోదీ చెప్పే అవకాశం ఉంది

Next Story