శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ :ట్రూజెట్‌ విమానంలో సాంకేతికలోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో సాంకేతికలోపం ఏర్పడింది.

దీంతో  విమానాన్ని  శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో  ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది.  ట్రూ జెట్‌ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి  విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.