హుజూర్ నగర్ : ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది, గులాబీ శ్రేణులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని హుజూర్ నగర్ ఓటర్లు ఇచ్చారు.  43, 233 ఓట్ల భారీ మెజార్టీతో  ఘన  విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కేసీఆర్ పాలనకు హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు రిఫరెండ్ అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లుగా  స్టేట్ లో ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా ప్రతిపక్ష నేతల్లోనే ఉందన్నారు.

టీఆర్ఎస్ భారీ విజయంపై కాంగ్రెస్ నేతలు ఎవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్  ఓడిపోతుందని మొదటి నుంచి చెబుతున్నప్పటికీ..ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ..తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు ఇంకా కష్టాలు తీరినట్లు కనిపించడంలేదు.  టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోటలో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ నేతలు స్పష్టమైన సంకేతాలు పంపిందనే చెప్పాలి. ఇప్పటికైనా..కాంగ్రెస్ నేతలు  కేసీఆర్ పై పోట్లాడకుండా ప్రజాసమస్యలపై పోరాడాలని విశ్లేషకులు అంటున్నారు.

సైదిరెడ్డి ఛరిస్మా, సానుభూతి, ప్రజలతో నిత్యం సంబంధాలు నడపటం,  కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం  టీఆర్ఎస్ కు ఓటేసేలా చేశాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె పేరుతో  కాంగ్రెస్ చేసిన రాద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేదన్నారు టీఆర్ఎస్ నేత బొంతూ రామ్మోహన్.

అభ్యర్ధుల వారీగా వచ్చిన మొత్తం ఓట్లు

1). కాంగ్రెస్ అభ్యర్ధి–69,563

2).టీ.ఆర్.ఎస్.అభ్యర్ధి–1,12,796

3). బీజేపీ అభ్యర్ధి–2,621

4). టీడీపి–1,827

5). వంగపల్లి కిరణ్–812

6). తీన్మార్ మల్లన్న–894

7). లింగిడి వెంకటేశ్వర్లు–162

సత్య ప్రియ బి.ఎన్