పోలీసు తుపాకీతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ భర్త హల్ చల్

By సుభాష్
Published on : 11 March 2020 7:13 PM IST

పోలీసు తుపాకీతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ భర్త హల్ చల్

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ భర్త కొరని మహాత్మ పోలీసు తుపాకీ పట్టుకుని ఫోటో దిగి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకోవడం సంచలనంగా మారింది. పోలీసుల అనుమతి లేకుండా ఇలా టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ భర్త తుపాకీతో ఫోటో దిగడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక కార్పొరేటర్‌ భర్త అయివుండి పోలీసు గన్‌ పట్టుకుని ఫోటో దిగడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా గన్‌ పట్టుకుని ఫోటోలకు ఫోజివ్వడంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story