ఇంత‌కీ... త్రివిక్ర‌మ్ ప్లాన్ ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 7:55 AM GMT
ఇంత‌కీ... త్రివిక్ర‌మ్ ప్లాన్ ఏంటి..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... తాజాగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ భారీ చిత్రంలో పూజా హేగ్డే క‌థానాయిక‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ అందించే త్రివిక్ర‌మ్ ఈ విభిన్న క‌థా చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

సంక్రాంతికి మూడు నెల‌ల‌కు పైగా టైమ్ ఉంది కానీ... త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసారు. అల‌.. వైకుంఠ‌పుర‌ము ఫ‌స్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఎందుకింత త్వ‌ర‌గా ప్ర‌మోష‌న్ ప్రారంభించారు..? ఎందుకింత తొంద‌ర‌..? అస‌లు... త్రివిక్ర‌మ్ ప్లాన్ ఏంటి..? అనేది అర్ధం కావ‌డం లేదు. తెలిసిన స‌మాచారం ఏంటంటే... సంక్రాంతికి ఈ సినిమాతో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌రిలేరునీకెవ్వ‌రు సినిమా కూడా రిలీజ్ కానుంది.

అందుచేత ఇప్ప‌టి నుంచే పాట‌లు రిలీజ్ చేస్తూ... ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూ... సినిమా పై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచాల‌నేది ప్లాన్ అట‌. అందుక‌నే ఇంకా చాలా టైమ్ ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. మ‌రి..ఇలా సాంగ్స్ ముందుగా రిలీజ్ చేయ‌డం క‌లిసోస్తుందా..? త్రివిక్ర‌మ్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? అనేది తెలియాలంటే సంక్రాంతికి వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story
Share it