సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో అధికారులు పచ్చదనానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. రెండు రోజుల క్రితం హరిత హారం మొక్కలను గొర్రె తినిందని వెయ్యి రూపాయలు జరిమానా వేశారు. తాజాగా..అదే జిల్లాలో కుడకుడ రోడ్డులో రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ షాపుకు చెట్టు అడ్డంగా ఉందని నరికేయడంతో అధికారులు ఆగ్రహించారు. లక్ష రూపాయలు జరిమానా విధించారు. సంబంధిత బిల్డింగ్ ఓనర్‌పై క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు మునిసిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story