అది దివాళా తీసిన పార్టీ.. అందుకే ఆయ‌న రాజీనామా చేశారు..!

By Newsmeter.Network  Published on  15 Dec 2019 11:56 AM GMT
అది దివాళా తీసిన పార్టీ.. అందుకే ఆయ‌న రాజీనామా చేశారు..!

కాంగ్రెస్ పార్టీని దివాళా తీసిన పార్టీగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణాలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదంటే ప్రజలు ఆ పార్టీని ఎంత తిరస్కరిస్తున్నారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చాల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

ఖమ్మంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన పైపులను ఎక్కడ పాతిపెట్టారు అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరచి చూడాలన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వలన కోటి ఎకరాలకు నీళ్ళు అందించి.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేదుకు కృషి చేస్తున్నారు అన్నారు. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఎన్నో గొప్ప గొప్ప పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. పంచాయతీరాజ్ విభాగానికి కేంద్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.

Next Story
Share it