ఏపీలో భారీగా జూనియర్‌ ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. పలువురు ఐఎఎస్‌లను జాయింట్‌ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఏపీ ప్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు27 మందిలో కొందరిని బదిలీ చేస్తూ, మరి కొందరికి నూతనంగా పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం.

వీరిలో సునిత్‌ కుమార, డాక్టర్ కె. శ్రీనివాసులు, కృష్ణ, కిశోర్‌కుమార్‌, మహేష్‌ కుమార్‌, ఎం. వేణుగోపాల్‌ రెడ్డి, పి. అరుణ్‌బాబు, శ్రీక్ష్మీత, కీర్తి చేకూరి, కె. వెంకట రమణారెడ్డి, హిమాన్ష్ శుక్లా, కె. మాధవీలత, శివశంకర్‌ హోటి దినేష్‌ కుమార్‌, పి. ప్రశాంతి, వెంకట మురళీ, టి.ఎస్‌ చేతన్‌, వినోద్‌కుమార్‌, ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, డి.మార్కెండేయులు, వి.వీరబ్రహ్మయ్య, ఎం.గౌతమి, సి.ఎం.సాయికాంత్‌ వర్మ, నిశాంత్‌కుమార్‌, ఢిల్లీరావు,
బి.లావణ్య, పట్టణశట్టి రవి సుభాష్‌, రామసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో పలువురికి 13 జిల్లాల్లోని జాయింట్‌ కలెక్టర్‌ రైతు భరోసా, రెవిన్యూ, జాయింట్‌ కలెక్టర్‌ గ్రామ, వార్డు సచివాయం, అభివృద్ధి, జాయింట్‌ కలెక్టర్‌, ఆసరా, సంక్షేమం పోస్టులు కేటాయించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *