ప్రారంభంలోనే కుప్పకూలింది.. 12 ఏళ్లలో తొలిసారి

By సుభాష్  Published on  13 March 2020 10:15 AM IST
ప్రారంభంలోనే కుప్పకూలింది.. 12 ఏళ్లలో తొలిసారి

దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కొనసాగుతూనే ఈ రోజు ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలోనే కుప్పకూలాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా, గ్లోబల్‌ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. షేర్ మార్కెట్ శుక్రవారం కూడా కుప్పకూలిపోయాయి. బెంచ్ మార్క్ సూచీలు ప్రారంభంలోనే పదిశాతం చొప్పున క్షిణించాయి. దీంతో మార్కెట్‌ ట్రేడింగ్‌ను సైతం నిలిపివేశారు. గత 12 సంవత్సరాల్లో ఇలా జరగడం తొలిసారి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 9.43 శాతం తగ్గుదలతో 29,687 పాయింట్ల నష్టంతో పతనమైంది. అంటే సెన్సెక్స్‌ 3వేల పాయింట్లకుపైగా పడిపోయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిప్టీ కూడా పది శతం పతనంతో అంటే 966 పాయింట్లకు క్షిణించింది.

స్టాక్‌ మార్కెట్‌ 45 నిమిషాల పాటు పని చేయదు

భారీ నష్టాలతో ట్రేడింగ్‌ నిలిపివేశారు. 45 నిమిషాల పాటు స్టాక్‌ మార్కెట్‌ పని చేయదు. అంటే తిరిగి 10.20 గంటలకు ట్రేడింగ్‌ ఆరంభమవుతుంది. మనదేశంలో మాత్రమే కాకుండా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ పదిశాతం కుప్పకూలింది. ఈ స్టాయిలో మార్కెట్‌ పతనం కావడం ఇదే మొదటిసారి.

కరోనా ఎఫెక్ట్‌

కాగా, భారత్‌లోనూ కరోనా ఎఫెక్ట్‌ పలు రంగాలపై పడుతోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్‌ భారీగా ఉండవచ్చని అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు డాలర్‌తో పొలిస్టే ఇండియన్‌ రూపాయి 20 పైసలు పడిపోయింది. 74.42 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్కరోజే రూ.11లక్షల కోట్ల సొమ్ము అవిరైపోయింది. నష్టాలకు భయపడి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Next Story