ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్‌ లేదని రూ. లక్ష చలాన్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 6:44 AM GMT
ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్‌ లేదని రూ. లక్ష చలాన్..

ఉత్తర ప్రదేశ్: కొత్త చట్టం అమలులోకి వచ్చి నెల రోజులు గడిచినా అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. బైక్ రైడ్ చేసే వ్యక్తికి హెల్మెట్ లేదని చలానా రాయటం కామన్.. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలానా వచ్చింది. గఢ్ ముక్తేశ్వరం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు హెల్మెట్ ధరించ లేదని , డ్రైవింగ్ లైసెన్స్ తనతో పాటు ఉంచుకోలేదని కారణంతో చలానా విధించినట్లు నోటీస్ వచ్చింది. దీంతో బాధితుడు ట్రాఫిక్ అధికారులను సంప్రదించగా ఎక్కడో పొరపాటు జరిగింది అంటూ చలానా రద్దు చేశారు.

ఇలాంటి పొరపాటే ఉత్తర ప్రదేశ్ లోని ఒక కార్ డ్రైవర్ విషయంలో కూడా జరిగింది. హెల్మెట్ పెట్టుకో లేదంటూ కార్ డ్రైవర్ కి చలానా విధించారు పోలీసులు. ఇక ఒడిస్సా లో ఒక స్కూటర్ దాని ఖరీదు కన్నా ఎక్కువ చలానా ఇవ్వగా, భువనేశ్వర్ లో ఒక వ్యక్తి కొత్త హోండా యాక్టివాను షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్తుతుండగా అడ్డుకున్న పోలీసులు స్కూటర్ పై రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటూ లక్ష రూపాయలు చలాన వేశారు

Next Story