చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే కొమ్మపల్లికొండ పై ఉన్న సిద్ధేశ్వరస్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా.. తవణంపల్లి మండలం కమ్మపల్లి వద్దకు రాగానే ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడిందని . ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయాల పాలయ్యారు.

ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన క్ష‌త‌గాత్ర‌లు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ట్రాక్టర్‌ పైన ప్రయాణాలు చేయటం మంచిది కాదని అన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.