కొత్త పార్లమెంట్‌ను సందర్శించిన తమన్నా, మహిళా బిల్లుపై కామెంట్

హీరోయిన్ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్‌ భవనాన్ని సందర్శించారు.

By Srikanth Gundamalla  Published on  21 Sept 2023 4:08 PM IST
Womens reservation bill, parliament, heroine tamannah,

కొత్త పార్లమెంట్‌ను సందర్శించిన తమన్నా, మహిళా బిల్లుపై కామెంట్ 

హీరోయిన్ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్‌ భవనాన్ని సందర్శించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సబలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ పలువురు నటీమణులను. ఇతర మహిళా ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో చేర్చించింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు పార్లమెంట్‌ వద్ద సందడి చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, ఖుష్బూతో పాటు పలువురు కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ సమయంలో వీళ్లు పార్లమెంట్‌ భవనాన్ని సందర్శించారు. ఎరుపు రంగు చీరలో మిల్కీ బ్యూటీ కనిపించింది. ప్రధాన ద్వారం వద్ద తమన్నాతో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తమన్నా స్పందించింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమన్నారు. ఈ చారిత్రక బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందని.. ఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. తమన్నాతో పాటు నటి దివ్యా దత్త కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు.

అంతకుముందు సభా కార్యకలాపాలు మొదలైన తర్వాత మంగళవారం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రత్యేక సెషన్‌కు హాజరైన విషయం తెలిసిందే. అలాగే సినీతారలు సినీతారలు షెహ్‌నాజ్‌ గిల్‌, భూమి పెడ్నేకర్‌ నిన్న పార్లమెంట్‌ భవనం వద్దకు విచ్చేసి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రశంసలు కురిపించారు. వీరే కాదు.. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.

Next Story