బంపర్ లాటరీ, నెలనెలా రూ.5.5 లక్షలు.. 25ఏళ్ల పాటు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ‘ఫాస్ట్‌ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో యూపీకి చెందిన ఓ వ్యక్తి ఈ జాక్‌పాట్‌ గెలుచుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 7:10 AM IST
UAE, Lottery, Monthly 5.5 Lakh,  25 Years,

బంపర్ లాటరీ, నెలనెలా రూ.5.5 లక్షలు.. 25ఏళ్ల పాటు

ఏ పని చేయకుండా నెలనెలా లక్షల జీతం వస్తే ఎలా ఉంటుంది..? ఏంటి ఏ పని చేయకుండా శాలరీనా అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. కానీ.. ఇది కంపెనీ ఇస్తోంది కాదు. లాటరీలో ఓ వ్యక్తి గెలుచుకున్నాడు. నెలలు కాదు.. ఏకంగా 25 ఏళ్ల పాటు నెలకు రూ.5.5 లక్షల చొప్పున వస్తాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) ‘ఫాస్ట్‌ 5’(FAST 5) పేరిట నిర్వహించిన లాటరీలో యూపీకి చెందిన ఓ వ్యక్తి ఈ జాక్‌పాట్‌ గెలుచుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొమహ్మద్ అదిల్‌ ఖాన్ కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నాడు. రియల్‌ ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అయితే.. అతడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుకున్నాడు. ఇటీవల యూఏఈ 'ఫాస్ట్‌-5' పేరిట లాటరీ నిర్వహించారు. అందులో ఒక టికెట్‌ కొన్నాడు ఆదిల్‌ ఖాన్‌. మెగా ప్రైజ్‌ మనీ డ్రాలో అతడు మొదటి విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని గరువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. లాటరీ ప్రకారం మొదటి విజేతకు రూ,.5,59,822 (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్ల పాటు ఇవ్వనున్నారు. దాంతో.. విజేతగా నిలిచిన ఆదిల్‌ ఖాన్‌ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ప్రైజ్‌ మనీ గెలుచుకున్న తర్వాత ఆదిల్‌ఖాన్‌ మాట్లాడాడు. డ్రాలో విజేతగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని.. ఈ సమయంలో డబ్బులు రాబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. తన కుటుంబానికి తానే ఏకైక జీవనాధారం అన్నాడు. కోవిడ్ సమయంలో అన్నయ్య చనిపోయాడని.. అతడి కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నానని ఆదిల్ ఖాన్ తెలిపాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉన్నట్లు చెప్పాడు.

‘ఫాస్ట్‌ 5’ లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఎమిరైట్స్ లాటరీ నిర్వహించే టైచెరస్‌ మార్కెటింగ్ హెడ్‌ వెల్లడించారు. స్వల్ప కాలంలో ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్ కావడానికి మేం ‘ఫాస్ట్‌ 5’ లక్కీడ్రా తీసుకొచ్చామని చెప్పారు. డబ్బుని మొత్తం ఒకేసారి ఇవ్వకుండా నెలనెలా ఇచ్చేలా ఆలోచన చేశామన్నారు.

Next Story