ట్విట్టర్‌ పేరును ఎందుకు మార్చారో చెప్పిన ఎలాన్ మస్క్

ట్విట్టర్‌ పేరును ఎందుకు మార్చారో క్లారిటీ ఇచ్చారు ఎలాన్‌ మస్క్‌.

By Srikanth Gundamalla  Published on  25 July 2023 10:27 AM GMT
Twitter, Name Change,  Elon Musk,

ట్విట్టర్‌ పేరును ఎందుకు మార్చారో చెప్పిన ఎలాన్ మస్క్

ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన నిర్ణయాలతో అందరూ షాక్‌ అవుతూనే ఉన్నారు. తాజాగా రెండ్రోజుల క్రితం ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా మారుస్తూ మస్క్‌ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్విట్టర్‌ బ్లూ బర్డ్‌ స్థానంలో కొత్త లోగోగా ఎక్స్‌ను తీసుకొచ్చారు. దాంతో.. మస్క్‌ ఎందుకు ట్విట్టర్‌ పేరును మార్చారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. తాను ట్విట్టర్‌ పేరును ఎందుకు మార్చారో క్లారిటీ ఇచ్చారు.

ట్విటర్‌ను ఇకపై సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఎలాన్‌ మస్క్. వాక్‌ స్వాతంత్ర్యానికి గుర్తుగా ట్విట్టర్‌ను మార్చాలని ఎక్స్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిందని ఎలాన్ మస్క్‌ చెప్పారు. అందులో భాగంగానే ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా మార్చామని అన్నారు. ఇక కేవలం పేరు మార్చుకోవడమే కాదు.. ఇకపై ట్విటర్‌ (ఎక్స్‌) అదే పనిచేస్తుంది. ఇప్పటి వరకు ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉండేది. అప్పుడు ట్విట్టర్‌ అనే పేరు సరిపోతుందని చెప్పారు. కానీ.. ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదని చెప్పారు ఎలాన్ మస్క్. ప్రస్తుతం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ట్వీట్లు మాత్రమే కాదు.. పెద్ద సైజ్ ఉన్న వీడియోలు కూడా షేర్ చేయొచ్చని వివరించారు. కొద్దినెలల్లో ఎక్స్‌లో ఇంకా మార్పులు కూడా తీసుకొస్తామని ఎలాన్ మస్క్ అన్నారు.

ఇకపై ఎక్స్‌ యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదని ఎలాన్ మస్క్ చెప్పారు. ఎక్స్‌ను ఎవ్రీథింగ్‌మా మారుస్తామని అన్నారు. ఇప్పటికే వీడియోలకు సంబంధించి కొత్త ఫీచర్లను పరిచయం చేశామని ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

ఇప్పటి వరకు ట్విట్టర్‌గా ఉండటంతో .. షేర్‌ చేస్తున్న వాటిని ట్వీట్‌ అన్నారు. కానీ ట్విట్టర్‌ను ఎక్స్‌గా మార్చడంతో .. కొత్తగా ఏమని పిలుస్తారో అని సందిగ్ధత నెలకొంది. కొత్తగా మరేదైనా పేరు పెడతారా అని చర్చలు జరుగుతున్నాయి. అదనపు ఫీచర్లు ఉంటాయా? ఉంటే సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుందా అనే ప్రశ్నలు అడుగుతున్నారు నెటిజన్లు.


Next Story