మీకిది తెలుసా? ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుకింగ్

దూర ప్రయాణాలకు ఎక్కువ మంది ట్రైన్‌ జెర్నీనే ప్రిఫర్ చేస్తారు.

By Srikanth Gundamalla  Published on  25 May 2024 4:55 PM IST
train, ticket booking,  Indian railway,

మీకిది తెలుసా? ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుకింగ్

దూర ప్రయాణాలకు ఎక్కువ మంది ట్రైన్‌ జెర్నీనే ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ ప్రయాణం చాలా తక్కువ ధరలే కాదు.. సుఖవంతం.. సురక్షితం కూడా. అయితే.. లాంగ్‌ జర్నీలు చేసేవారు నెలల ముందుగానే ట్రైన్ టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బెర్త్‌లు ఉండవు. కూర్చొని ప్రయాణంచేయాల్సి వస్తుంది. ఇక ఒక రోజు ఉందే మన ప్రయాణం ఖరారు అయితే మాత్రం.. తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇక కొన్ని గంటల ముందే ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే? అవును ఇలాంటి వారికి కూడా అవకాశం కల్పిస్తోంది రైల్వే శాఖ. టికెట్లు ఖాళీగా ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రైల్వే శాఖ.

చాలా మంది ప్రయాణికులు వారి వారి కారణాలతో ప్రయాణం చేసే రోజునే టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రెండు చార్ట్‌లను ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్‌ చార్జ్‌ రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రెడీ చేస్తారు. రెండో చార్జ్‌ ట్రైన్ స్టార్ట్ అవడానికి ముందే తయారు చేస్తారు. గతంలో అరగంట ఉందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతి ఉండేది. కానీ.. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ఉందు వరకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నారు. కాబట్టి ట్రైన్‌ స్టార్ట్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

చివరి నిమిషంలో ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే.. ముందు ఆ ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నాయా లేదా చూడాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో రైల్వే శాఖ ప్రిపేర్ చేసిన చార్జ్‌ను చూడొచ్చు. IRCTC యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఛార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. సీట్లు ఖాళీగా ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Next Story