టమాటా ధరల ఎఫెక్ట్..మెక్‌ డొనాల్డ్స్‌ దారిలోనే సబ్‌వే

సబ్‌వే కూడా తమ ఔట్‌లెట్స్‌లో సలాడ్స్, శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 11:43 AM GMT
Tomato Rates, Mcdonalds, Subway ,

 టమాటా ధరల ఎఫెక్ట్..మెక్‌ డొనాల్డ్స్‌ దారిలోనే సబ్‌వే

టమాట ధరలు భగ్గుమంటున్నాయి. కొంత కాలం నుంచి టామాట కొనాలంటేనే చుక్కలు కనబడుతున్నాయి. సామాన్యుల పరిస్థితి అయితే మరీ దారుణం. టమాటా లేకుండానే కొందరు కూరలు చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని ఫుడ్‌ కంపెనీలు కూడా బ్యాన్‌ చేశాయి. ఇప్పటికే మెక్‌ డొనాల్డ్స్‌ టమాటా లేకుండానే తమ ఐటమ్స్‌ ఉంటాయని ప్రకటించింది. ఇదంతా తాత్కాలికమే అయినా.. టమాటా తినడం అంటేనే భారమవుతోంది. తాజాగా మెక్‌ డొనాల్డ్స్‌ దారిలోనే సబ్‌వే నడిచింది.

సబ్‌వే కూడా తమ ఔట్‌లెట్స్‌లో సలాడ్స్, శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర కూరగాయలు, అందులోనూ టమాటా ధర ఏకంగా 400 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పటి టమాట ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా.. కూడా ఇప్పటికీ టమాటా ధర రూ.100కి పైనే ఉంటుంది.

టమాటా వినియోగాన్ని నిలిపివేసినట్లు న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, చెన్నైతో సహా పలు ప్రధాన నగరాల్లో కొన్ని సబ్‌వే ఔట్‌లెట్‌లలో డిస్ ప్లే బోర్డు పెట్టింది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లోని సబ్‌వే స్టోర్ లో 'టమాటాలు తాత్కాలిక అందుబాటులో లేవు' అని కస్టమర్లకు బోర్డును ప్రదర్శించింది. ప్రస్తుతం వాటి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత టమోటాలను సోర్స్ చేయలేకపోతున్నామని పేర్కొంది. టమాటా ధరలు చాలా రెస్టారెంట్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్‌లను ప్రభావితం చేశాయి. మెక్‌డొనాల్డ్స్‌ ఇటీవల తన మెనూ నుంచి బర్గర్ టమాటాను తొలగించింది. నాణ్యత ప్రమాణాలు కొరవడినందుకు టమాటాను నిలిపివేసినట్లు ప్రకటించింది.


Next Story