హైదరాబాద్‌లో చంద్రబాబుకి ఘనస్వాగతం.. సీఎం సీఎం అంటూ నినాదాలు
తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చారు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 5:34 AM GMTహైదరాబాద్‌లో చంద్రబాబుకి ఘనస్వాగతం.. సీఎం సీఎం అంటూ నినాదాలు
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ఫారెన్ వెళ్లారు. అమెరికాలో కొద్ది రోజులు ఉన్నారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. బుధవారం ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సందడి కనిపించింది. స్వాగతం పలికిన సందర్భంగా అభిమానులు సీఎం.. సీఎం.. సీఎం.. అంటూ చంద్రబాబు కోసం నినాదాలు చేశారు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుసీఎం సీఎం అంటూ అభిమానుల నినాదాలు pic.twitter.com/bmqKPTHe2L
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 29, 2024
కాగా చంద్రబాబు విశ్రాంతి కోసం మే 19వ తేదీన విదేశాలకు వెళ్లిన విసయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతుండటంతో విదేశీ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు తాజాగా స్వదేశానికి వచ్చారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. దాంతో.. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మూడు పార్టీల నాయకులు దీమాగా చెబుతున్నారు. అధికార పార్టీ వైసీపీ మాత్రం..తామే మరోసారి అధికారంలోకి రాబోతున్నామనీ.. సీఎం జగన్ సంక్షేమానికి జనం మెచ్చారని చెబుతున్నారు. ఏదీ ఏమైనా రిజల్ట్ కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.