ఖాళీగా భూమికి స్టార్‌లైనర్.. మరో 6 నెలలు స్పేస్‌లోనే సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  25 Aug 2024 3:07 AM GMT
sunita williams,  six months,   space , starliner

ఖాళీగా భూమికి స్టార్‌లైనర్.. మరో 6 నెలలు స్పేస్‌లోనే సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు బుచ్‌ విల్‌మోర్ కూడా ఉన్నారు. మొదట కేవలం 8 రోజుల పాటు అక్కడే ఉండేందుకు వెళ్లారు. కానీ.. ఇప్పుడు నెలలు గడుస్తున్నా వారి భూమిపైకి చేరుకోవడం లేదు. మరో ఆరు నెలల పాటు సునీత, బుచ్‌ విల్‌మోర్ అక్కడే ఉంటారని తాజాగా నాసా ప్రకటించింది. అంటే 8 రోజులు కాస్త.. 8 నెలలు అయ్యింది. గత జూన్‌ నెల 5వ తేదీన స్టార్‌లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. 8 రోజుల పాటు సేవలందించేందుకు వెళ్లి అక్కడే చిక్కుకుని పోయారు. వీళ్లు అంతరిక్షంలోకి స్టార్‌లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అది ఎంతకీ సరికావడం లేదు. దాంతో.. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌లో అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ద్వారా వారిద్దరినీ భూమిపైకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ఖాళీగానే భూమికి చేరుకోనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రయాణంలో క్యాప్స్యూల్‌ పనితీరును నాసా, బోయింగ్‌ సంస్థ పరిశీలించనున్నాయి. మరోవైపు, వచ్చే ఫిబ్రవరి వరకు సునీతా, విల్‌మోర్‌లు స్పేస్‌ స్టేషన్‌లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్‌ టెస్టింగ్‌ చేయనున్నారు.

నాసా అధికారులు ఈ మేరకు మాట్లాడుతూ.. ‘అంతరిక్షయానం ఎంతో సురక్షితం, సాధారణమే.. అయినప్పటికీ ఎప్పటికీ ప్రమాదకరమే. విల్‌మోర్‌, సునీతా విలియమ్స్‌ను స్పేస్‌ స్టేషన్‌లోనే మరిన్ని రోజులు ఉంచాలని నిర్ణయించాం. వారి భద్రత దృష్ట్యా ఖాళీగానే స్టార్‌లైనర్‌ను భూమిపైకి తీసుకురానున్నాం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టార్‌లైనర్‌ సెప్టెంబర్‌లో భూమిపైకి తిరుగుప్రయాణం ప్రారంభించనుందని చెప్పారు.



Next Story