తీహార్‌ జైలు క్లబ్‌లో కవిత కూడా మెంబర్ అవుతారు: సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 10:57 AM IST
sukesh chandrasekhar, letter,  mlc kavitha, ed case,

తీహార్‌ జైలు క్లబ్‌లో కవిత కూడా మెంబర్ అవుతారు: సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా.. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్‌ జైలు క్లబ్‌ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. త్వరలోనే కవిత కూడా ఈ క్లబ్‌లో సభ్యురాలు కాబోతున్నారంటూ లేఖ రాశాడు సుఖేశ్ చంద్రశేఖర్.

లిక్కర్ స్కాం కేసులో కవితను ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈడీ అధికారులు లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ కస్టడీలో ఉన్న కవితకు లేఖ రాశాడు జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్. తీహార్‌ జైలు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయ్యిందని పేర్కొన్నాడు. కవిత త్వరలోనే తీహార్ జైలు క్లబ్‌లో సభ్యులు కాబోతున్నారని చెప్పాడు. ఇక ఇదే లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే అరెస్ట్‌ అవుతాడని చెప్పారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన మొత్తం ఈడీ విచారణలో బయపడుతుందని చెప్పారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు సీరియస్‌గా కొనసాగుతోందనీ.. వాట్సాప్‌ చాటింగ్, కాల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

ఈ క్రమంలోనే సుఖేశ్ చంద్రశేఖర్ అర్వింద్‌ కేజ్రీవాల్‌ను కాపాడాలని అనుకునే వారికి సలహా ఇస్తున్నట్లు చెప్పాడు. ఎవరూ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పాడు. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని సూచించాడు. లిక్కర్‌ స్కాం కేసు అందరినీ అరెస్ట్ చేసేందుకు ఈడీ వద్ద స్ట్రాంగ్‌ ఎవిడెన్స్ ఉన్నట్లు చెప్పాడు. లిక్కర్‌ స్కాంలో మీ అందరికీ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఎదురుచూస్తున్నానని లేఖలో సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

ఇక ఈడీ కస్టడీపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈడీ దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పిటిషన్‌లో కవిత పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరగనుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story