శ్రీశైలం గేట్లు ఎత్తడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన అధికారులు
వరద ఉధృతితో నిండుకుండను తలపిస్తోంది శ్రీశైలం డ్యామ్.
By Srikanth Gundamalla Published on 29 July 2024 4:23 AM GMTశ్రీశైలం గేట్లు ఎత్తడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన అధికారులు
శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తింది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నిండుకుండను తలపిస్తోంది శ్రీశైలం డ్యామ్. ఈ నేపథ్యంలో గేట్లు ఓపెన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు సజీవం కానుంది. శ్రీశైలం నుంచి నేరుగా వరద జలాలు సాగర్ ప్రాజెక్టును చేరనున్నాయి. కృష్ణా బేసిన్‌లో వరదలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి జూరాలకు భారీగా వరద వస్తోంది. దాంతో... అదే స్థాయిలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది. ఇక కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 69 వేల 522 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 62 వేల 847 క్యూసెక్కులుగా ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. మంగళవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. జలశాయం రేడియల్ క్రష్ గేట్లు ఎత్తి.. దిగువున ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలు లేదా 11 గంటల సమయంలో క్రషర్ గేట్లు ఎత్తి నీటి దిగువకు తరలించే అవకాశం ఉంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం డ్యామ్ క్రషర్ గేట్లు ఎత్తలేదు. ఈసారి దాదాపు 15, 20 రోజుల ముందే క్రషర్ గేట్లు ఎత్తుతారని తెలియడంతో ఆసక్తి నెలకొంది.