పీకల్లోతు కష్టాల్లో స్పైస్‌జెట్.. 3 నెలలు సెలవులు, నో శాలరీ!

. స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 8:00 AM GMT
పీకల్లోతు కష్టాల్లో స్పైస్‌జెట్.. 3 నెలలు సెలవులు, నో శాలరీ!

విమాన ప్రయాణికులు చాలా మంది తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలంటే ఎంచుకునే ఎయిర్‌లైన్స్ స్పైస్‌ జెట్. ఇందులో టికెట్‌ ధరలు మిగతా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయితే.. స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరేళ్ల నుంచి వరుసగా నష్టాలనే చూస్తోంది. దాంతో.. సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది స్పైస్‌జెట్ విమానయాన సంస్థ. ఈ నేపథ్యంలోనే ఈ స్పైస్‌జెట్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది.

ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వొద్దని నిర్ణయించింది. గురువారం 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెలవుల్లో పంపించినట్లు ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పైస్‌జెట్‌ విమానయాన వర్గాలు చెబుతున్నాయి. కష్ట సమయంలో ఎయిర్‌లైన్స్‌ను సహకరిస్తున్న సిబ్బందికి యాజమాన్యం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఫర్‌లాఫ్ స‌మ‌యంలోనూ ఉద్యోగుల‌ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవుల సదు‌పాయం అలాగే ఉంటాయ‌ని పేర్కొంది స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ. చివరిసారిగా 2017-18లో మాత్ర‌మే రూ. 557.4 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఆ త‌ర్వాత ఆరేళ్ల‌ నుంచి వ‌రుస‌గా న‌ష్టాలనే చ‌విచూస్తోంది స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్.

Next Story