ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
పి.సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 7:29 AM ISTప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు
ప్రముఖ గాయని పి.సుశీల అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఎన్నో పాటలు పాడరు. పద్మభూషన్ అవార్డు గ్రహీత. అయితే.. పి.సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆమె కడుపు నొప్పితో బాధపడ్డారు. దాంతో.. కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 86 ఏళ్ల వయసు ఉన్న పి. సుశీల కడుపు నొప్పితో బాధపడటంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
కడుపు నొప్పి తగ్గేందుకు ఆస్పత్రిలోనే ఆమెకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. కడుపునొప్పి తాము ఇస్తున్న మందులతోనే త్వరగా నమయం అవుతుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు పి.సుశీల త్వరగా కోలుకోవాని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. కాగా.. పి. సుశీల గత కొంత కాలంగా అనారోగ్యంతోనే బాధపడుతున్నారని తెలిసింది.