స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది: సీమెన్స్ మాజీ ఎండీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసు గురించి సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Sep 2023 8:45 AM GMTస్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది: సీమెన్స్ మాజీ ఎండీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందని చెప్పారు. తన జీవితంలో తాను సంపాదించుకున్నది గౌరవం అని తెలిపారు సుమన్ బోస్.
2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందినీ.. దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించామని చెప్పారు. సీమెన్స్ కంపెనీ, ఏపీసెస్‌ఎస్‌డీసీ మధ్య ఒప్పందం కుదిరిందని అన్నారు. ఒక సాఫ్ట్‌వేర్‌పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతందని.. మార్కెటింగ్ భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని తెలిపారు. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు అని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ తెలిపారు. 2.32 మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పారు. అయితే.. 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశామన్నారు. ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‍ఎస్‍డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని అన్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి తాను బయటకు వెళ్లిపోయాననీ.. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని సుమన్ బోస్ చెప్పారు.
గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‍ఎస్‍డీసీనే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది సుమన్ బోస్ అన్నారు. ఒక్క కేంద్రాన్నీ సందర్శించలేదు.. ఎక్కడా తనిఖీ చేయకుండా అక్రమాలు జరిగాయంటున్నారని చెప్పారు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీగా మారిందనీ... ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి, మనీలాండరింగ్ జరగలేదని స్పష్టంగా చెప్పారు. స్కిల్ డెవలప్‍మెంట్.. చాలా విజయవం తమైన ప్రాజెక్టు అని.. 2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు అందించిన అంతిమ ఫలితాలు చూసి మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన అన్నారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్.. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు. సీమెన్స్ లో ప్రాజెక్టు అప్రూవల్‍కు అన్ని పత్రాలు ఉన్నాయి..ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదని చెప్పారు. అయితే.. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానానికి అన్ని విషయాలు చెబుతామని సుమన్ బోస్ వెల్లడించారు.