వారినెందుకు తీసుకోలేదు? BCCI సెలక్టర్ల తీరును తప్పుబట్టిన శశిథరూర్

శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ జట్లను ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  19 July 2024 1:00 PM IST
shashi tharoor, comments,  bcci, team india selection,

వారినెందుకు తీసుకోలేదు? BCCI సెలక్టర్ల తీరును తప్పుబట్టిన శశిథరూర్ 

శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. అయితే.. ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి టీమిండియా ఆయన సారథ్యంలో మ్యాచ్‌లు ఆడబోతుంది. అయితే.. శ్రీలంక టూర్‌కు ప్రధాన కోచ్‌ గంభీర్, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగర్కార్ నేతృత్వంలో టీమ్‌ను ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయలేదు. దాంతో.. సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సీరియస్ అయ్యారు.

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ రాజకీయాల గురించి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఇలా క్రికెట్‌ గురించి కూడా విమర్శలు చేస్తుంటారు. తాజాగా మరోసారి బీసీసీఐపై విమర్శలు చేశారు. ఇప్పుడు జట్ల సెలక్షన్‌పై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ మేరకు బీసీసీఐ విమర్శలు చేశారు. 'ఈ నెలలో భారత్‌ శ్రీలకం పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. గత వన్డేలో సెంచరీ చేసి అద్భుతంగా రాణించిన ఓ బ్యాటర్‌కు అవకాశం దక్కలేదు. సంజూ శాంస‌న్ త‌న చివ‌రి వ‌న్డేలో సెంచరీ కొట్టాడు. కానీ అత‌న్ని లంక‌తో జ‌రిగే వ‌న్డేల‌కు సెలెక్ట్ చేయ‌లేదు. జింబాబ్వేతో సిరీస్‌లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్‌ శర్మను టీ20ల్లో ఎలా పక్కన పెట్టారు? ఇలా అద్భుతంగా రాణించే వారు సెలక్టర్లకు చిన్న విషయంగా కనిపిస్తున్నారా? ఏదేమైనా శ్రీలంక పర్యటనకుఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు. టీమిండియా జట్టుకు ఆల్‌ దిబెస్ట్‌' అని శశిథరూర్‌ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Next Story