ఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు.
By Srikanth Gundamalla Published on 24 May 2024 11:49 AM ISTఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు అరవింద్ యాదవ్. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఇక తాజాగా సిడ్నీలోని సముద్ర తీరంలో అరవింద్ యాదవ్ మృతదేహం లభ్యం అయ్యింది. సముద్రంలో శవమై తేలడంతో అరవింద్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయార.
ఇంటి నుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అతని మృతదేహాన్ని గుర్తించామని వెల్లడించారు. ఇక డెడ్‌బాడీ ఉన్న కొద్ది దూరంలోనే అతడి కారును కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అరవింద్‌ను ఎవరైనా చంపారా? లేదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ సూసైడ్ చేసుకున్నాడని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసలు ఆస్ట్రేలియాలోని అరవింద్ స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. ప్రస్తుతం అతని భార్య కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
కాగా ఉద్యోగం నిమిత్తం పన్నెండేళ్లుగా సిడ్నీలోనే ఉంటున్నాడు అరవింద్. ఇటీవల 18 నెలల క్రితం అరవింద్ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, తల్లితో కలిసి అరవింద్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూసిన వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.