శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త
శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 5:06 AM GMTశబరిమల అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త
శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఇక నుంచి అయ్యప్ప దర్శన సమయాన్ని మరో గంటపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యమాలలు వేసిన వారు శబరిమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే రద్దీ మరింత ఎక్కువ కావడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం లభించేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజులో రెండో భాగంలో దర్శన సమయాన్ని అధికారులు గంటపాటు పొడిగించారు.
సాధారణంగా రోజులో రెండో భాగం దర్శనాలు సమయం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతాయి. రాత్రి 11 గంటల వరకు రెండోభాగంలో దర్శనాలకు భక్తులకు అనుమతి ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాన్ని ఒక గంట పాటు పెంచారు. సాయంత్రం 3 గంటల నుంచి రెండో భాగం దర్శనం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అయ్యప్పస్వామి వారి దర్శన సమయం గంటపాటు ఎక్కుగా కొనసాగుతుంది. ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రెండో భాగం దర్శనాలు ప్రారంభం అయ్యి రాత్రి 11 గంటల వరకు కొనసాగతాయని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ గంట సమయం పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది అయ్యప్పస్వామి వారిని దర్శించుకుంటారు. ఈ మేరకు బోర్డు నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.