త్వరలోనే తిరిగి వస్తా.. ఆర్‌.నారాయణమూర్తి హెల్త్‌ అప్‌డేట్

పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి బుధవారం అస్వస్థతకు గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2024 7:41 AM IST
R.narayana murthy, health update, apollo hospital,

త్వరలోనే తిరిగి వస్తా.. ఆర్‌.నారాయణమూర్తి హెల్త్‌ అప్‌డేట్ 

పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో.. ఆయన్ని వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఆర్‌.నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా.. నారాయణమూర్తి ఉన్నట్లుండి అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్.నారాయణమూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

కాగా.. తన ఆరోగ్యంపై ఆర్‌. నారాయణమూర్తి స్వయంగా స్పందించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అభిమానులు ఆందోళన చెందొద్దని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. దేవుడి దయంతో త్వరగానే కోలుకుంటున్నట్లు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత అన్ని వివరాలను చెబుతానని ఆర్‌. నారాయణమూర్తి పేర్కొన్నారు. ఎవరూ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్దంటూ కోరారు. .

మరోవైపు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు కూడా ఆర్.నారాయణమూర్తి ఆరోగ్యంపై స్పందించారు. ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని చెప్పారు. చికిత్స అందిస్తున్నామనీ.. క్రమంగా ఆయన కోలుకుంటున్నారని అన్నారు. ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులే’ నని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.

Next Story