రాజమండ్రి జైల్ వద్ద ఆర్జీవీ సెల్ఫీ, క్యాప్షన్‌పై వివాదం
తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన పనితో వివాదానికి తెర తీసినట్లు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 8:00 PM IST
రాజమండ్రి జైల్ వద్ద ఆర్జీవీ సెల్ఫీ, క్యాప్షన్‌పై వివాదం
సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అనే చెప్పాలి. ఆయన మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన పనితో వివాదానికి తెర తీసినట్లు అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో ఆర్జీవీ ఏదో ఒక హడావిడి చేస్తూ ఉంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఆర్జీవీ పోస్టులు పెడతారు. ఆయన పోస్టులను కొందరు సమర్ధిస్తే.. కౌంటర్లకు కొదవేం ఉండదు. తాజాగా ఆయన రాజమండ్రికి వెళ్లారు. ఊరికే ఉండకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద సెల్ఫీ ఫొటోలు దిగారు.
ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు డైరెక్టర్ ఆర్జీవీ. రెండు ఫొటోలను షేర్ చేస్తూ.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సెల్ఫీ దిగాను.. నేను బయట ఉన్నాను.. అతను లోపల ఉన్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్టు అయ్యి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సెల్ఫీ దిగి రెండు ఫొటోలను షేర్ చేసి ఇచ్చిన క్యాప్షన్ చంద్రబాబుని ఉద్దేశించి చేశారనేది అర్థం అవుతోంది. ఇప్పుడు ఆయన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటు టాలీవుడ్‌తో పాటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పలువురు టీడీపీ మద్దతుదారులు ఆర్జీవీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా నెక్ట్స్ ఇక్కడికే రాబోయేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రాజమండ్రిలో జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు వెళుతూ సెంట్రల్ జైలు వద్ద కారు ఆపి ఆర్జవీ సెల్ఫీ దిగారు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 26, 2023