రామోజీరావు నాకు మార్గదర్శకుడు: రజనీకాంత్
రామోజీరావు మృతిపై హీరో రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla
రామోజీరావు నాకు మార్గదర్శకుడు: రజనీకాంత్
రామోజీరావు మృతిపై హీరో రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు తనకు గురువు అనీ..తన శ్రేయోభిలాషి అని చెప్పారు. రామోజీరావు ఇకలేరనే వార్త తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చెప్పారు. కాగా..రామోజీరావు అనారోగ్యం శనివారం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
రామోజీరావు మరణం పట్ల సంతాపం తెలిపిన రజనీకాంత్.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాత్రికేయ రంగంలో.. సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. అంతేకాదు.. అటు రాజకీయాల్లో కూడా గొప్ప కింగ్ మేకర్ అని నిరూపించకున్నారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. తన జీవితంలో రామోజీరావుకి ప్రత్యక స్థానం ఉందని పేర్కొన్నారు. తనకు రామోజీరావు ఒక మార్గదర్శకుడు అని చెప్పారు. ఆయన జీవితంలో చాలా విషయాలను చెప్పారనీ.. స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని రామోజీ రావును గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇక రామోజీరావు కుటుంబ సభ్యులకు రజనీకాంత్ సంతాపం తెలియజేశారు.