టాలీవుడ్ హీరో, బిగ్‌బాస్ 3 ఫేం వరుణ్ సందేశ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత జీడిగుంట రామచంద్ర మూర్తి (80) మంగళవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన.. ఈ రోజు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కథ, నవల, నాటకం, వ్యాసం, ప్రసార మధ్యమ రచన తదితరలో ప్రముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. అలాగే రేడియో కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణానికి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
1940లో జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులోనే వరంగల్ సహకార బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంత కాలం వద్యాశాఖలో పని చేసిన అనంతరం 1971లో హైదరాబాద్ ఆకాశవాణిలో చేరి పూర్తి స్థాయి రచయితగా, రేడియో కళాకారుడిగా కొనసాగారు. రామచంద్రమూర్తి 300 కథలు, 40 నాటికలు,8నవలలు రేడియో టెలివిజన్ సినిమా మాధ్యమాల్లో అనేక రచనలు రాశారు.