అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట.. ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కేంద్ర పెద్దల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 12:43 PM ISTఅయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట.. ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కేంద్ర పెద్దల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాలని పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా ప్రభాస్‌కు కూడా ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు కేంద్ర పెద్దలు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేస్తోంది ఆలయ ట్రస్ట్.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానం పంపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దాదాపు 2వేల మందికి ఆలయ ట్రస్టు బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపింది.
టాలీవుడ్ నుంచి ఇద్దరికే ఈ అవకాశం దక్కింది. మొదట మెగాస్టార్ చిరంజీవికి ఈ ఆహ్వానం పంపారు. ఆ తర్వాతా తాజాగా ప్రభాస్‌కు కూడా ఈ ప్రత్యేక ఆహ్వానం లభించింది. కాగా.. ప్రభాస్ ఫ్యామిలీ మొదటి నుంచి ఉంది. అంతేకాక.. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించారు. ప్రభాస్‌తో పాటు ఇతర సినీ నటులకు ఈ అవకాశం లభించింది. బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్, కన్నడ నుంచి కేజీఎఫ్ స్టార్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందట. మరోవైపు మలయాళం నంచి మోహన్‌లాల్‌ను ఆహ్వానించారు.