వన్డే వరల్డ్‌ కప్‌: రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI

వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్‌ కప్‌కు బీసీసీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వారికి గోల్డెన్ టికెట్‌ను బహూకరిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  19 Sept 2023 3:11 PM IST
ODI, World Cup-2023, golden tickets, rajinikanth, BCCI,

వన్డే వరల్డ్‌ కప్‌: రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI

భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌ జరగనుంది. అయితే.. 2011 తర్వాత భారత్‌ వన్డే వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. దాంతో.. ఈ మెగా ఈవెంట్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్రాండ్‌ సక్సెస్‌ చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్‌ కప్‌కు బీసీసీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వారికి గోల్డెన్ టికెట్‌ను బహూకరిస్తోంది.

గోల్డెన్ టికెట్‌ వీఐపీ పాస్ వంటిది. ఈ టికెట్‌ ఉంటే వరల్డ్‌ కప్‌ టోర్నీలోని ఏ మ్యాచ్‌ను అయినా.. స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీలో కూర్చొని చూడవచ్చ. ఇప్పటి వరకు బీసీసీ రెండు వీఐపీ టికెట్లను జారీ చేసింది. ఒకటి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వగా.. మరోటి క్రికెట్‌ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు అందించింది. తాజాగా మరో టికెట్‌ను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అందజేసింది బీసీసీ. ఈ మేరకు గోల్డెన్‌ టికెట్‌ను బీసీసీ కార్యదర్శి జైషా చెన్నైలోని రజనీకాంత్‌ నివాసానికి వెళ్లి ఆయన చేతికి స్వయంగా అందించారు. రజనీకాంత్‌ను ఓ విశిష్ట అతిథిగా భావిస్తూ వరల్డ్‌ కప్‌కు ఆహ్వానించినట్లు బీసీసీఐ తెలిపింది. భాష, సంస్కృతికి అతీతంగా రజనీకాంత్ తనదైన ముద్ర వేశారని బీసీసీఐ కొనియాడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాకతో వరల్డ్‌ కప్ నిర్వహణకు మరింత వన్నె తెస్తారని బీసీసీఐ భావిస్తోంది.

Next Story