కొట్లాడుకున్న జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ఫ్యాన్స్

తానా కాన్ఫరెన్స్ లో గొడవలు; కొట్లాడుకున్న జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ఫ్యాన్స్

By Bhavana Sharma  Published on  9 July 2023 10:18 AM GMT
NTR, Lokesh, Fans Fight, Thana Conference,

కొట్లాడుకున్న జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ఫ్యాన్స్

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో పలు వేరువేరు సందర్భాల్లో గొడవలు పుట్టుకొచ్చాయి. చాలాకాలం తర్వాత జరుగుతున్న తానాసభలకు తెలుగు సినీ నటీనటులతోపాటు ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు.

అయితే ఈరోజు ఇంటర్నెట్లో ఈ వేడుకల నుండి వీడియోలు వైరల్ అవుతుండడంతో అక్కడ వివిధ కారణాలవల్ల ఉద్రిక్తత నెలకొన్న విషయం పై క్లారిటీ వచ్చింది. కొంతమంది తెలుగు వారు ఈ వీడియోలో ఒకరినొకరు కొట్టుకుంటున్న విషయం మనం చూడవచ్చు. ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు కారణం ఏమిటో అని జనాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, తానా సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టిడిపి నాయకులు దాడి చేశారు. టిడిపి మీటింగులో జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతో అక్కడున్నటువంటి నారా లోకేష్ అభిమానులంతా కూడా రెచ్చిపోయి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నువ్వు కొట్టడం మొదలుపెట్టారు. అది మాత్రమే కాకుండా అసలు జూనియర్ ఎన్టీఆర్ కు మరియు టిడిపికి సంబంధం ఏమిటంటే తెలుస్తోంది.

చొక్కాలు పట్టుకొని మరి తరలి పరుచూరి మరియు సతీష్ వేమన వర్గాలు కొట్టుకున్నారట. టిడిపి ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కోట్లాట జరగడం మాత్రమే కాకుండా రెండుగా చీలి పిడిగుద్దులు కూడా గుద్దుకున్నట్టు తెలుస్తోంది.

Next Story