దేవర సినిమా చూసే వరకు బతికించండి: ఎన్టీఆర్ అభిమాని
ఓ 19 ఏళ్ల యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 9:51 AM ISTఓ 19 ఏళ్ల యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఎక్కువ కాలం బతకడు అని చెప్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న ఆ యువకుడు.. తనని ఎన్టీఆర్ సినిమా దేవర విడుదల అయ్యే వరకు బతికించండి అంటూ డాక్టర్లతో చెబుతున్నాడు. అయితే.. మరోవైపు కన్నబిడ్డను బతికించుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఆ యువకుడి తల్లి మీడియా ముందు కన్నీటిపర్యంతం అయ్యింది.
టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ (19) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2022 నుంచీ బ్లడ్ కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. దీని నుంచి అతను బయటపడలేదు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్ మారో చికిత్సకు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే కౌశిక్ తన తల్లితో మాట్లాడుతూ.. ‘అమ్మా.... నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. దేవర సినిమా విడుదల వరకూ బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి’ అని కౌశిక్ కోరాడు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన ఆ తల్లి కన్నీటి పర్యంతం అయ్యింది. తన బిడ్డ జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని అనీ.. దేవర సినిమా చూసి చచ్చిపోతా అంటున్నాడంటూ బాధపడింది. 27వ తేదీ వరకు బతికించండి అంటున్నాడనీ.. ఎలాగైన నా బిడ్డకు ప్రాణం పోయండి అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరు పెట్టుకుంది.
కాగా.. కౌశిక్ ప్రస్తుతం ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్ మారో చికిత్సకు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సాయం చేయదలచిన వారు 9490829381 ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా గానీ, లేదా కె.సరస్వతి, యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబరు 103310100044506 (IFSC UBIN0801313)కు సాయం అందించవచ్చు. 79956 65169 ఫోన్ నంబరులో కౌశిక్ తల్లిదండ్రులను సంప్రదించవచ్చు.