జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. వాహనదారులకు అలర్ట్
జూన్ 1వ తేదీ నుంచి పలు నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 May 2024 6:46 AM IST
జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. వాహనదారులకు అలర్ట్
జూన్ 1వ తేదీ నుంచి పలు నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబుతున్నాయి. దాంతో.. వాటిని ప్రజలు తెలుసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సామాన్యుడి జేబుకి చిల్లు పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు పలు నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్త నెల ప్రారంభం నుంచే వీటిని అమల్లోకి తెస్తున్నారు. ఇక ఏ ఏ నిబంధనలు మారబోతున్నాయో తెలుసుకుందాం...
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్
జూన్ 1వ తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారబోతున్నాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవోకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు. కొత్త రూల్ ప్రకారం ఆర్టీవో ఆఫుసుకి వెళ్లి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు. అధీకృత ప్రయివేట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు.
వారికి వాహనం ఇస్తే భారీ జరిమానా
కొందరు వాహనదారులు మైనర్‌లకు వాహనాలు ఇస్తుంటారు .ఈ క్రమంలో వారు పోలీసులకు పట్టుబడితే జరిమానా విధిస్తూ ఉంటారు. ఇటీవల పుణెలో ఓ మైనర్ కారు నడిపి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. ఈ క్రమంలోనే మైనర్‌కు వాహనం నడిపితే విధించి జరిమానను పెంచుతున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25000 వరకు జరిమానా విధించనున్నారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ ధర మార్పులకు చాన్స్
సామాన్యులను వెంటాడుతున్న ధరల్లో ఒకటి గ్యాస్ సిలిండర్ ధర. చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటాయ్. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను విడుదల చేస్తుంటాయి. ఈసారి జూన్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల కొత్త రేట్లు విడుదల అవుతాయి. 14 కిలోల డొమెస్టిక్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను చమురు ధరలను నిర్ణయిస్తాయి ఆయా కంపెనీలు. అయితే.. ఈసారి ధరలు పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎంత మేర పెంచుతారనేది కంపెనీలు విడుదల చేస్తాయి.
ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ గడువు
ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉడటం సహజం. ప్రాంతాలను మారుస్తున్న క్రమంలో ఇందులో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే యూఐడీఏఐ ఆధార్ కార్డు అప్‌డేట్ గురించి సమాచారం ఇచ్చింది. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది. ఎలాంటి రుసుము లేకుండానే జూన్ 14వ తేదీ వరకు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అప్‌డేట్ కోసం అంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో అప్‌డేట్‌కు రూ.50 చొప్పున చెల్లించాలి.