భారత్‌కు చెందిన రెండు మసాల కంపెనీలకు నేపాల్ షాక్
ఇండియాకు చెందిన రెండు మసాలల కంపెనీలకు నేపాల్ షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:55 AM ISTభారత్‌కు చెందిన రెండు మసాల కంపెనీలకు నేపాల్ షాక్
ఇండియాకు చెందిన రెండు మసాలల కంపెనీలకు నేపాల్ షాక్ ఇచ్చింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలకు చెందిన మసాలలను నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో కూడా ఈ రెండు కంపెనీలపై బ్యాన్ విధించారు. కాగా.. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులను ఆపేస్తున్నట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ వెల్లడించారు.
నేపాల్ మార్కెట్లో ఈ రెండు కంపెనీలకు సంబంధించి విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. ఈ రెండు మసాలల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయనీ ఇటీవల వార్తలు వచ్చాయి. క్రమంలోనే నేపాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలల్లో ఇథలిన్ ఆక్సైడ్ మోతాదుకి మించి ఉన్నట్లు ఇటీవలే తేలింది. ఎవరెస్ట్ మాసలలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ పేర్కొంది. దాంతో.. వాటిని తిరిగి భారత్‌కు పంపాలని ఆదేశించింది. ఎండీహెచ్ సాంబార్ మలసాలలో కూడా కేన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ రెండు కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆయా దేశాలు నిషేధం విధించాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఈ కంపెనీలపై నిషేధం విధించాయి. హాంకాంగ్ ఇటీవల మూడు ఎండీహెచ్ మసాల దినుసులు, ఎవరెస్ట్ చేపల మసాల విక్రయాలను బ్యాన్ చేసింది.
మరోవైపు ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో .. ఇండియాలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భారత్‌లోని పలు ప్రాంతాల నుంచి హెండీహెచ్, ఎవరెస్ట్ మసాలలను సేకరించి నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.
ఇథలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?
ఇథలిన్ ఆక్సైడ్‌కు మండే స్వభావం ఉంటుంది. దీన్ని పురుగుల మందు తయారీలో ఉపయోగిస్తారు. మోతాదుకి మించి ఇది శరీరంలో చేరితో రొమ్ము క్యాన్సర్‌తో పాటు నాడీమండల వ్యవస్థ, మెదడు, డీఎన్‌పై దుష్ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.